నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోమ్ గార్డ్స్ అధికారులు, సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి వర్షాకాలంలో అత్యవసర సమయాలలో రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES