- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బ్లెడ్ ట్రాక్టర్లతో వీధులలో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులు పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ మూగబోజన్న, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యులు కుంట శేఖర్, గుండు రాజేందర్, ఉల్లెంగ లక్ష్మి, సుద్దపల్లి గంగు, ప్యాట్ల గంగుబాయి, ఎంబరి నాగేష్, రాటం సాగర్, కరోబార్ వేణు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



