Monday, March 23, 2026
E-PAPER
Homeనిజామాబాద్మాచారెడ్డిలో ప్రత్యేక వైద్య శిబిరం

మాచారెడ్డిలో ప్రత్యేక వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పి.హెచ్.సి. మాచారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఆదర్శ్ తెలిపారు. ఈ శిబిరం ఈ నెల 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మాచారెడ్డిలో మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో జరగనుంది. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్ (స్త్రీ రోగ నిపుణులు), ఆర్థోపెడిక్ (ఎముకల నిపుణులు), ఆప్తాల్మాలజిస్ట్ (కంటి వైద్యులు), డెంటల్, జనరల్ వైద్య నిపుణులు పాల్గొని రోగులను పరీక్షించనున్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్య సమస్యలను పరిశీలించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. శిబిరం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -