Saturday, July 5, 2025
E-PAPER
Homeనిజామాబాద్గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి

గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ కోరారు. శనివారం మండలంలోని కోన సముందర్  గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు.ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, మొరంను గ్రామ పంచాయతీ నుండి ఇండెంట్ తెచ్చుకుంటే తహసిల్దార్ కార్యాలయం వేబిల్స్ ఇప్పిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంలో మాత్రం ఎలాంటి జాప్యం జరగదని, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -