Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం

- Advertisement -

– కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- రాయపోల్
: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణిస్తే జీవితంలో అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతోపాటు క్రీడలలో రాణిస్తే వారి జీవితంలో నాయకత్వ లక్షణాలతో పాటు అనతికారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్ -14, అండర్- 17 విభాగాలలో వాలీబాల్, ఖో- ఖో, కబడ్డీ బాలబాలికలకు క్రీడా పోటీలు వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండు రోజులు ఈ పోటీలు నిర్వహించబడతాయని, గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad