Friday, January 30, 2026
E-PAPER
Homeఖమ్మంక్రీడలతో పోటీ తత్వం, స్పూర్తి పెంపొందుతాయి

క్రీడలతో పోటీ తత్వం, స్పూర్తి పెంపొందుతాయి

- Advertisement -

– అశ్వారావుపేట కళాశాల ఆతిథ్యానికి నెలవు
– పీజేటీఏయూ డీఏస్ఏ సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

క్రీడలు, ఆటలు, సాంస్కృతిక సాహిత్యం పోటీల ద్వారా బోధనేతర సిబ్బందిలో పోటీ తత్వాన్ని,స్ఫూర్తిని,సమూహ పని విధానం, రోజు వారీ విధుల్లో నిబద్ధత,శ్రద్ధ పెంపొందుతాయి అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది క్రీడోత్సవాలు 2025 – 25 ను స్థానిక వ్యవసాయ కళాశాల లో జనవరి 30 వ తేదీ శుక్రవారం నుండి ఫిబ్రవరి 2 వ తేది సోమవారం వరకు నిర్వహించనున్నారు.

ఈ క్రీడలు,ఆటలు, సాంస్కృతిక సాహిత్య పోటీలను శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లాంచనంగా ప్రారంభించారు. మూడు రోజులు పాటు విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో  జరిగే ఈ పోటీల్లో 5 జోన్ లు నుంచి 200 మంది బోధనేతర సిబ్బంది పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట ఆతిథ్యానికి పెట్టింది పేరని ప్రశంసించారు.విశ్వవిద్యాలయం అభివృద్ది లో బోధన,బోధనేతర సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైందని వారికి కావలసిన మౌళిక వసతులను కల్పించడంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ భోధనేతర సిబ్బంది సంఘం అద్యక్షులు ఎం.శ్రీనివాస యాదవ్, సహా అధ్యక్షులు ఎం. రాజ, జనరల్ కార్యదర్శి కే.జయరామ్, ఉపాధ్యక్షులు ఎం.దశరధ్, జాయింట్ సెక్రటరీ శ్రీ 6. పరమేశం, కార్యనిర్వాహాక కార్యదర్శి  కె. రవీందర్ రెడ్డి, కల్చరల్,గేమ్స్ సెక్రటరీ ఎం.సంజీవ రెడ్డి, టెక్నికల్ సెక్రటరి శ్రీమతి జీ.సులోచన, ట్రెజరర్ ఎస్కే నజీర్ లు ప్రసంగించారు. 

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ  ఎఫ్ఐఎం (ఫాం ఇంప్లిమెంట్ స్ అండ్ మెకానిజం) విశ్రాంత అధ్యాపకులు  శ్రీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్ కళాశాల అభివృద్ది లో  విశ్వవిద్యాలయ తోడ్పాటును వెల్లడిచారు.ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది కృషిని,ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల నిర్వహణలో అందరి సహాయ సహా కారాలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల బోధన,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.ముందుగా 5 జోన్ కంటి జెంట్స్ మార్చ్ ఫాస్ట్ చేశారు ఆ తర్వాత దీప ప్రజ్వలన, అనంతరం అసోసియేట్ డీన్ స్వాగత ప్రసంగం, విశ్వవిద్యాలయ పరిశీలకులు డాక్టర్ కె.చరిత కుమార్,ఓఐఎస్ఏ (ఆఫీసర్ ఇన్ చార్జి స్టూడెంట్స్ ఎఫైర్స్) డాక్టర్ ఎం.రాంప్రసాద్ లు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -