Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి..

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి..

- Advertisement -

యువజన, క్రీడల శాఖ అధికారి రఘు 
నవతెలంగాణ – భూపాలపల్లి
: క్రీడలు మానసికల్లాసానికి దోహదపడతాయని యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారి సిహెచ్ రఘు అన్నారు. ఆదివారం ప్రపంచ సైకిల్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీ నుండి అంబేద్కర్  సెంటర్ వరకు  నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఎస్సై సాంబమూర్తి తో కలిసి  జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే చదువుతోపాటు క్రీడలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, ఖేలొ ఇండియా  కోచ్ శ్రీనివాస్ రెడ్డి, కోచ్  ఐశ్వర్య, క్రీడా కారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -