రక్తదానం చేసిన 3,127 మంది ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రాంగణాల్లో నిర్వహించిన శిబిరాల్లో 3,127 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఆ సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి 78వ జన్మదినం సందర్భంగా గురువారం రక్తదాన శిబిరాలను నిర్వహించినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శ్రీచైతన్య క్యాంపస్‌లో సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రక్తదానం చేసిన ఉద్యోగులను కొనియాడారు. దేశవ్యాప్తంగా రక్తం కొరతను తీర్చేందుకు రక్తదాతలు రావాలని పిలుపు నిచ్చారు. దాతల ఆరోగ్యానికి కూడా రక్తదానం మంచిదని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ ఒకవైపు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ, మరోవైపు సామాజిక సేవలోనూ తమ వంతుగా పాల్గొంటున్నట్టు తెలిపారు. రక్తదానం చేసిన ఉద్యోగులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని వెస్ట్ జోన్ ఏజీఎం జి.రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఏజీఎం లు, డీన్స్, ప్రిన్సిపాల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య రక్తదాన శిబిరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



