‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సినిమాటిక్ స్పెక్టికల్ ‘రాజు గారి గది 4: ‘శ్రీచక్రం’తో రెడీ అవుతోంది. రాజు గారి గదిని కల్ట్ హారర్-కామెడీ ఫ్రాంచైజీగా మార్చిన ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ 4వ భాగం ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. దసరా శుభ సందర్భంగా శుక్రవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎర్రటి చీరలో ఒక మహిళ, ఉగ్రమైన, దైవిక కాళిని గుర్తుచేసే దేవత విగ్రహం ముందు ఎగురుతోంది. ఈ అద్భుతమైన ఇమేజరీ పవిత్రమైన, అతీంద్రియాల మధ్య సాగే చిత్రానికి టోన్ సెట్ చేస్తుంది. ‘ఎ డివైన్ హర్రర్ బిగిన్స్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో శ్రీచక్రం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. గ్రాండ్ విజువల్స్, ఎస్‌ఎస్ తమన్ పవర్ ఫుల్ మ్యూజిక్, ఓంకార్ సిగేచర్ స్టోరీ టెల్లింగ్‌తో, ఈ సినిమా యూత్, కుటుంబ ప్రేక్షకులను అలరించే మాస్ థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది.
పురాణ విశ్వాసాలు, హిడెన్ సీక్రెట్స్, మరచిపోయిన వారసత్వాలపై ఆధారంగా రూపుదిద్దుకున్న డివైన్ హారర్-కామెడీ ‘శ్రీచక్రం’. ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. రహస్యాలతో నిండిన ‘కాలికాపురం’ అనే గ్రామం నేపథ్యంగా నడిచే ఈ కథ, కేవలం ఒక హాంటెడ్ టేల్ మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక యాత్రలా సాగుతూ, మిస్టిసిజంతో నిండి, సస్పెన్స్ థ్రిల్ల్స్, మాస్ హ్యూమర్ మూమెంట్స్‌తో ఎంటర్‌టైన్ చేసే గొప్ప అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రానికి నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, దర్శకత్వం: ఓంకార్, సంగీతం: తమన్, డిఓపి: సమీర్ రెడ్డి, ఎడిటర్: తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, డైలాగ్స్ : అజ్జు మహాకాళి.
పవర్‌ఫుల్ కథతో ‘శ్రీ చక్రం’
- Advertisement -
- Advertisement -