Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని  ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించినారు.  విద్యార్థులు బాలకృష్ణ, రాధాకృష్ణ వేషాధారణలతో ఆకట్టుకున్నారు. స్కూల్ ప్రాంగణం పువ్వులు, ఉట్టి తో అందంగా అలంకరించబడింది. సాంప్రదాయ గీతాలు, భజనలు, కృష్ణలీలల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వంశీ రోమా మాట్లాడుతూ  సాంప్రదాయ పండుగలు పిల్లలకు మన సంస్కృతి, నీతి, భక్తి విలువలను పరిచయం చేస్తాయి. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులు ఆనందంతో పాటు సాంస్కృతిక చైతన్యాన్ని పొందుతారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -