Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలు27న శ్రీరామనవమి.. ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌

27న శ్రీరామనవమి.. ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని నాగపూర్ గ్రామంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ మోర్తాడ్ శివారులోని ప్రజా నిలయంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ఆధ్వర్యంలో సునీల్ రెడ్డిని కలిసి సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేసి, సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సునీల్ రెడ్డిని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసిన నాగాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను కూడా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంపదండి తిరుపతి మాట్లాడుతూ మండలంలోని నాగపూర్ గ్రామంలోని రామాలయంలో పెద్ద ఎత్తున సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాములవారి కళ్యాణాన్ని తిలకించాలన్నారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అభి, పార్వతి రాజేష్, బసకొండ శ్రీనివాస్, గడ్డం గోవర్ధన్, ధోన్ పాల్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -