- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తహశీల్దార్ గా శ్రీలత మంగళవారం ఉధ్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇదివరకు పనిచేసిన తహశీల్దార్ శ్రీకాంత్ నర్సాపూర్ కు బదిలీ పై వెళ్లారు. దీంతో ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయంలో పనిచేసిన తహశీల్దార్ శ్రీలత కు నిర్మల్ జిల్లా కు కేటాయించారు. బదిలీల్లో భాగంగా ముధోల్ కు వచ్చారు . బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ శ్రీలతకు ముధోల్ ఆర్ఐ నారాయణ రావు పటేల్, ఆర్ఐ 2 సరస్వతి,మండల సర్వేయర్ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ, వీఆర్ఏలు, కార్యాలయం సిబ్బంది పూల బోకెతో స్వాగతం పలికారు. ముధోల్ మండలంలోని నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కారాన్ని కృషి చేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు.
- Advertisement -