- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : గురువారం గురు పౌర్ణమి సందర్భంగా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో దత్తాభిషేకం నిర్వహించిచారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు దంపతులు హాజరై స్వామి వారికి అభిషేకం, సహస్ర నామ అర్చన, మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్టుగా శ్రీనుబాబు తెలిపారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయ స్వామి వారి ఆలయ క్షేత్రంలో ప్రత్యేక భజనలతోపాటు అన్నదానం నిర్వహించారు.
- Advertisement -