కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
విలువల రాజకీయాలకు, నిస్వార్థ ప్రజాసేవకు ప్రతిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావుని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి అన్నారు. సోమవారం శ్రీపాదరావు 27వ వర్థంతి మండలంలోని కొయ్యుర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని అభివృద్ధి ప్రదాత శ్రీపాదరావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కొండ రాజమ్మ, జంగిడి శ్రీనివాస్, బండారి నర్సింగం, గడ్డం క్రాంతి, అబ్బినేని లింగస్వామి, మేకల రాజయ్య, ఉప సర్పంచ్లు అక్కల దేవేందర్, తాళ్ల రవిందర్, లకావత్ సవేందర్, కాంగ్రెస్ నాయకులు రాహుల్, జంబోజు రవిందర్, కొండూరి మమత, చంద్రమోహన్, కిషన్ నాయక్, రాజు నాయక్, సతీష్ పాల్గొన్నారు.



