- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపిడిఓ కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఎంపిడిఓ క్రాంతికుమార్ ఆదేశాల మేరకు సోమవారం కార్యాలయం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మహేందర్, మహేష్, చిరంజీవి, సాయి పాల్గొన్నారు.
- Advertisement -



