Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

తాడిచెర్లలో ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్,స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి వేడుకలు సర్పంచ్ బండి స్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. మంథని అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నేత శ్రీపాదరావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య, కాంగ్రెస్ నాయకులు తిర్రి సమ్మయ్య, కుంట సది, పైడాకుల సమ్మయ్య, బూడిద రాజ సమ్మయ్య, వేంకటేశ్వర రావు, తాండ్ర మల్లేష్, సమ్మయ్య, బండి రణదీర్, రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -