- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఎన్.శృతిక ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ వాసవి హై స్కూల్ కరస్పాండెంట్ ఉమాకాంత్ కొనియాడారు. శ్రీ వాసవి హై స్కూల్ లో చదివిన విద్యార్థినికి బాసర త్రిబుల్ ఐటీలో సీటు లభించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్బంగా శృతిక ను పాఠశాల యజమాన్యం ఘనంగా సత్కరించి మెమొంటో అందజేసింది. తమ పాఠశాలలో చదువుకొని బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించినందుకు పాఠశాల యజమాన్యం ఆ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -