Saturday, April 4, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రమాదం అంచున ఎస్సారెస్పీ కెనాల్ రహదారి

ప్రమాదం అంచున ఎస్సారెస్పీ కెనాల్ రహదారి

- Advertisement -
  • చెరిగిపోతున్న రహదారి అంచులు
  • – వెంటనే మరమ్మత్తులు చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి
  • నవతెలంగాణ – రాయికల్
    మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌పై దాటేందుకు ఏర్పాటు చేసిన రహదారి ప్రమాదకరంగా మారింది. కెనాల్ పక్కన ఉన్న రహదారి అంచులు క్రమంగా చెరిగిపోతుండటంతో ఎప్పుడైనా గండి పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ రైతులు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో కెనాల్‌లో నీటి ప్రవాహం పెరిగే సమయంలో రహదారి మరింత దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.ఈ నేపథ్యంలో వేసవికాలంలోనే మరమ్మత్తులు చేపట్టి రహదారిని బలోపేతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోకపోతే ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -