నవతెలంగాణ-హైదరాబాద్: వర్గ పోరు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది.తాజాగా బీజేపీ నేత తోక్చమ్ రాధేశ్యామ్ సింగ్.. ఇవాళ ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నటల్ఉ ఆయన చెప్పారు. గవర్నర్‌కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్‌లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. స్పీకర్ సత్యబ్రత వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిశారని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు.
మణిపూర్ అసెంబ్లీ సామర్థ్యం 60 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే మరణించడం వల్ల 59 మాత్రమే ఉన్నారు. బీజేపీ కూటమిలో 32 మంది మైయితీ తెగ ఎమ్మెల్యేలు, ముగ్గురు మణిపురి ముస్లిం ఎమ్మెల్యేలు, 9 మంది నాగా వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మొత్తం సంఖ్య 44గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైయితీ తెగువకు చెందినవారే. మైతీలు, కుక్కీలు కొట్టుకోవడంతో.. మాజీ బీజేపీ నేత ఎన్ బిరేన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండు తెగల మధ్య జరిగిన పోరును ఆపలేకపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.