Friday, July 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో ఆహార కేంద్రం వద్ద తొక్కిసలాట

గాజాలో ఆహార కేంద్రం వద్ద తొక్కిసలాట

- Advertisement -

21మంది మృతి
గాజా :
దక్షిణ గాజాలో జీహెచ్‌ఎఫ్‌ ఆహారం పంపిణీ చేస్తున్న కేంద్రాల వద్ద తాజాగా జరిగిన మారణహోమంలో 21మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలామంది తొక్కిసలాటలోనే చనిపోయినట్టు తెలుస్తోంది. ఖాన్‌ యూనిస్‌ నగరంలోని రేషన్‌ సెంటర్‌ వద్ద బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. సాయుధులైన ఆందోళనకారులే ఈ సంఘటనకు బాధ్యులని జీహెచ్‌ఎఫ్‌ చేసిన ఆరోపణలను గాజా ఆరోగ్య శాఖ తీవ్రంగా ఖండించింది. జీహెచ్‌ఎఫ్‌ కేంద్రం వద్ద బుధవారం 21మంది పాలస్తీనియన్లు మృతిచెందగా, వారిలో తొక్కిసలాట కారణంగా 15మంది చనిపోయారని,, ఆహారం కోసం వచ్చిన వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మరికొంతమంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటిసారిగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఊపిరాడక మరణాలు సంభవించాయని ఆ ప్రకటన పేర్కొంది. అక్కడున్న గుంపుపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడం తాము చూసినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాటకు దారితీసిందని చెప్పారు. ఆహారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు వచ్చారని, వారు వచ్చిన తర్వాత ఆహార కేంద్రం ప్రధాన గేటు కూడా మూసివేశారని, అది కూడా కొంత కారణమైందని నాజర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సాయుధులే కారణమన్న జీహెచ్‌ఎఫ్‌
ఆహార కేంద్రం వద్ద ఒక్కసారిగా ప్రమాదకరమైన రీతిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, 19మంది తొక్కిసలాటకు గురి
(మొదటిపేజీ తరువాయి)
కాగా, మరొకరు కత్తిపోట్లకు గురయ్యారని జీహెచ్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఆహారం కోసం వచ్చిన ఆ గుంపులోనే హమాస్‌కు చెందినవారు, సాయుధులైన వ్యక్తులు వున్నారని, వారి కవ్వింపు చర్యలతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను చూపలేదు. ఆ గుంపులో అనేకమంది ఆయుధాలు చేబూని వుండడం తాము చూశామని జీహెచ్‌ఎఫ్‌ సిబ్బంది చెప్పారని ఆ ప్రకటన పేర్కొంది. తమ కాంట్రాక్టర్లలో ఒకరిని తుపాకీతో బెదిరించారని కూడా చెప్పారు. అయితే ఈ సంఘటనలపై జిహెచ్‌ఎఫ్‌ వాదనను, వారి వైఖరిని పాలస్తీనా అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కొత్త మిలటరీ కారిడార్‌ ఏర్పాటు
ఖాన్‌ యూనిస్‌ నగరంలో కొత్త మిలటరీ కారిడార్‌ను ఇజ్రాయిల్‌ నిర్మిస్తోంది. తూర్పు, పశ్చిమ ఖాన్‌యూనిస్‌ ప్రాంతాలను వేరు చేస్తూ కొత్తగా మిలటరీ రోడ్‌ను వేసినట్టు మిలటరీ తెలిపింది. 15కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌ గాజాను విభజించడానికి ఇజ్రాయిల్‌ ఏర్పాటు చేసిన నాల్గవ మార్గం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -