Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశోభాయాత్ర‌లో తొక్కిసలాట

శోభాయాత్ర‌లో తొక్కిసలాట

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ ఆల‌యా శోభాయాత్ర‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట జ‌రిగింది. 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఒక మైనర్ బాలిక ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స కొసం గ్వాలియర్‌కు తరలించగా, మరో ముగ్గురికి దాబ్రాలో చికిత్స అందిస్తున్నారు. పెద్దఎత్తున మహిళలు తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కలశయాత్ర ముందుగా నిర్దేశించిన మార్గాల్లో బయలుదేరి నవగ్రహ ఆలాయనికి చేరుకున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. క‌లశ యాత్రలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం దాబ్రా స్టేడియం వద్దకు పెద్దఎత్తున మహిళలు చేరుకున్నారని, కలశాల పంపిణీ జరుగుతుండగా తోపులాట చోటుచేసుకుందని గ్వాలియర్ కలెక్టర్ రుచిక చౌహాన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -