Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంసుందరయ్య నిబద్దత కు నిలువెత్తు సాక్ష్యం: సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య

సుందరయ్య నిబద్దత కు నిలువెత్తు సాక్ష్యం: సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నీతి – నిబద్దత లకు పుచ్చలపల్లి సుందరయ్య జీవనం నిలువెత్తు సాక్ష్యం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. సీపీఐ(ఎం) దక్షిణభారత నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ని సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల స్థానికి ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ చెప్పందే చేయడం నిబద్దత అని, చేసేదే చెప్పడం పారదర్శకం అని ఈ రెండింటిని రెండు కళ్ళు లా భావించిన సుందరయ్య భవిష్యత్తు తరాలకు ఆదర్శం అని అన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు,మండల కమిటీ సభ్యులు ఏసు,హమాలీ వర్కర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad