Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమరజ్యోతి కేంద్రాన్ని ప్రారంభించండి

అమరజ్యోతి కేంద్రాన్ని ప్రారంభించండి

- Advertisement -

సీఎంకు ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ చిన్నారెడ్డి వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జీ. చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన అమర వీరుల స్మారక కేంద్రాన్ని సందర్శించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన తొలి, మలి దశ ఉద్యమకారుల స్మారకం కోసం నిర్మించిన అమర జ్యోతి కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ గంటా జలంధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -