Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

- Advertisement -

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలలో పోశారని నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని అన్నారు. నేటికీ రైస్ మిల్లుల కేటాయింపు జరగలేదని,ధాన్యానికి మ్యాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుండడంతో రైతులు రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని అక్కడ క్వింటాకు1600 నుండి 1800 రూపాయలు మాత్రమే ఇస్తూ మధ్యవర్తులు రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పత్తి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.సన్నధాన్యానికి బోనస్ చెల్లిస్తూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య,రైతు సంఘం మండల నాయకులు మైల నాయకులు సత్తయ్య,డివైఎఫ్ఐ మండల నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర,ప్రజానాట్యమండలి మండల నాయకులు గడ్డం రాంబాబు,రైతులు ఎరుకలి బిక్షం,నీలకంఠం శివ,జంగయ్య,రాములు,నరసింహ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -