నవతెలంగాణ – సదాశివ నగర్
తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివనగర్ ను స్టేట్ అబ్జర్వర్ ఏ ఉషారాణి గురువారం సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రార్థనా సమయములో విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందించడం జరిగింది తరగతి గదిలో జరుగుతున్న బోధన అభ్యసన ప్రక్రియను పరిశీలించారు. ఖాన్ ఆకాడమీ ద్వారా ఎంతమంది విద్యార్థులు తమ అభ్యాసన కొనసాగిస్తున్నారు.
అది ఏవిధంగా పిల్లలకు ఉపయోగకరంగా ఉందో తెలుసుకున్నారు. ఒకేషనల్ ల్యాబ్ లను పరిశీలించారు. .ఒకేషనల్ కోర్సు ద్వారా ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడ్డారో తెలుసుకోవడం జరిగింది. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఆదర్శ పాఠశాలను సందర్శించిన స్టేట్ అబ్జర్వర్
- Advertisement -
- Advertisement -