Magazines

రోజుకు 114 ఆత్మ‌హ‌త్య‌లు

21 నిమిషాల క్రితం

suicides
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

రైతుల రుణమాఫీకి కేంద్రం నిరాకరణ.. కార్పొరేట్లకు నజరానాలు : ఏఐకేఎస్ జాతీయ అధ్య‌క్షుడు అశోక్ ధావ‌లే

న‌ల్ల‌గొండ నుంచి న‌వ‌తెలంగాణ ప్ర‌త్యేక ప్ర‌తినిధి

మోడీ అధికారంలోకి వచ్చాక పుష్కర కాలంలో దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఏఐకేఎస్‌ ‌జాతీయ అధ్యక్షులు అశోక్‌ ‌ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ 114 మంది బలవంతంగా చనిపోతున్నారని చెప్పారు. పంటలకు ఎంఎస్పీ లేకనే రైతుల బలవన్మరణాలు జరుగుతున్నాయ‌ని వాపోయారు. సంక్షోభంలో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయమంటుంటే ససేమిరా అంటున్న మోడీ ప్రభుత్వం, కార్పొరేట్లకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాత్రం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారం లేనప్పుడే తెలంగాణాలో నాడు రైతాంగ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాలను ఎర్ర జెండా పంచిందని గుర్తు చేశారు. అనంతరం కేరళ, బెంగాల్‌, త్రిపురలో అధికారంలోకొచ్చాక అక్క‌డి వామ‌ప‌క్ష ప్ర‌భుత్వాలు లక్షల ఎకరాలను పంచాయని వివ‌రించారు. మనకు రాజ్యాధికారం కావాలి, రైతు, కార్మిక, సామాజిక, ప్రజా సమస్యలపై పోరాడుతూనే రాజకీయ కర్తవ్యాన్ని కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స‌ర్ ‌ముసుగులో కోట్లాది ఓట్లను తొల‌గిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓట్‌ ‌చోర్‌, అయోధ్య మందిరంలో కానుకల చోర్ అయిన మోడీ స‌ర్కార్‌ను గ‌ద్దె దించాల‌న్నారు. ఈ రాజకీయ కోణాన్ని ఏఐకేఎస్ ముందుకు తీసుకుపోవాలని ధావ‌లే ఆకాక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్