రాష్ర్టం పరువు దిగజారుస్తున్నారు : కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేటీఆర్ ధ్వజం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ నాయకుల ముందు రాష్ర్టం పరువు దిగజార్చుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గాంధీ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి బాడీగార్డుగా మారారని విమర్శించారు. ‘‘హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షులు పరుగులు తీశారు. రాహుల్ వెంట అలా పరుగులు తీయడమేంటి? గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోశారు. తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న గడ్డ. ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అని కేటీఆర్ అన్నారు. రెండు పార్టీలకు చెందిన రాష్ర్ట నాయకులు ప్రజలు ఇచ్చిన పదవుల గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.






కామెంట్‌లు (0)