Magazines

కేంద్రం రూ. 50 వేల కోట్ల కరువు పరిహారం ప్రకటించాలి

9 నిమిషాల క్రితం

drought
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

రాష్ట్రంలో 365 కరువు మండలాలను ప్రకటించిన ప్ర‌భుత్వం, కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో విఫ‌ల‌మైంద‌ని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రువు సాయం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. కేంద్రం రూ. 50 వేల కోట్ల కరువు పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత వహించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్ర‌భుత్వ భూములను పెట్టుబడిదారులకు క‌ట్ట‌బెట్టేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని కోరారు. రైతు నేత సామినేని రామారావును కాంగ్రెస్ పొట్టన పెట్టుకుందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం రైతాంగ పోరాటాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్