Magazines

సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

13 నిమిషాల క్రితం

militant
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

తలంగాణ రైతు సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తీగ‌ల సాగ‌ర్

న‌ల్ల‌గొండ నుంచి బొల్లె జ‌గ‌దీశ్వ‌ర్
రైతులు, యువకులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పిలుపునిచ్చారు. ఏఐకేఎస్ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా న‌ల్ల‌గొండ‌లో ఆదివారం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మారకపోతే ఈ పాలకులను గద్దె దింపడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలాని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. త్రిపుల్ ఆర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపడుతున్నదని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం కోసం ఉద్యమించాలని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని అన్నారు. మహారాష్ట్ర తరహాలో మహా పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్