చేతులెత్తేసిన ప్రభుత్వం
అదుపు తప్పిన ఆందోళనలు
ఊపిరి పోసుకున్న 'ఎల్లో-వెస్ట్' ఉద్యమం
పారిస్ : అధిక జీవనవ్యయం, తీవ్ర ఒత్తిడికి గురైన ప్రజా సేవలకు నిరసనగా గత నెలలో ఫ్రాన్స్‌లో మొదలైన ఆందోళ నలు అదుపు తప్పి హింసకు దారితీస్తున్నాయి. నిరసనకారులు దుకాణాలలో చొరబడి దోపిడీలకు పాల్పడ్డారు. జనావాసా లను ధ్వంసం చేశారు. అనేక ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. హింసకు తీవ్రవాద వామపక్ష రాడికల్స్, అవకాశ వాద నేరస్థులే కారణమని ప్రభుత్వ అధికారులు నిందించారు. అయితే వేలాది అరెస్టులు, పోలీసు దాడులు, ప్రదర్శనలపై ఆంక్షల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఊపందు కున్నదని, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి అది అద్దం పట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితు లపై సెప్టెంబరులో చిన్నపాటి నిరసనలతో ప్రారంభమైన ఉద్య మం ఆ తర్వాత అత్యంత తీవ్రమైన పౌర అశాంతిగా మారింది.
పోలీసుల అత్యుత్సాహం
పాఠశాలల దిగ్బంధనాల సమయంలో పోలీసులు ఏడు వేల మంది మైనర్లను అరెస్ట్ చేయడం విమర్శలకు దారితీ సింది. ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అరెస్టులను అమానుష మైనవిగా వారు అభివర్ణించారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీనేజర్లపై లాఠీలు ఝుళిపించారు. భాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులను ప్రయోగించారు. విద్యార్థుల ఉద్యమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వామపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు భాగస్వాములు కావడంతో ఆందోళనలకు మద్దతు పెరిగింది. 2018-2019లో దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ప్రభుత్వంతో తలపడిన 'ఎల్లో-వెస్ట్' ఉద్యమానికి ఆందోళనలు మళ్లీ ఊపిరి పోశాయి.
నిస్సహాయ స్థితిలో మాక్రాన్
అక్టోబర్ 17న దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలతో ఉద్యమం మరింత ఉధృతమైంది. ఫ్రాన్స్‌లోని అతి పెద్ద నగరాలైన పారిస్, మార్సెయిల్, లియోన్‌లో అల్లరిమూకలు, దోపిడీదా రులు చెలరేగిపోయారు. అప్పటి నుంచి ప్రతి వారం ప్రజలు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకం గా వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ నిరసనలు ప్రశాం తంగానే జరిగినప్పటికీ ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలతో ఘర్షణలు చెలరేగాయి. పోలీ సు చర్య లపై అంతర్గత బృందాలు విచారణలు కూడా జరిగా యి. దేశంలో చెలరేగు తున్న అల్లర్లు అధ్యక్షుడు మాక్రాన్‌కు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. వచ్చే ఏప్రిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. అయితే నిరసనకా రుల డిమాండ్లను నెరవేర్చ డానికి ఆయన ప్రస్తుతం సిద్ధంగా లేరు. ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక ఒత్తిడే దీనికి కారణం. ప్రభుత్వం కొన్ని అరకొర చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు.






కామెంట్లు (0)