నిందితుడికి రూ.వెయ్యి జరిమానా
సిరిసిల్ల కోర్టు తీర్పు..
బాధిత బాలికకు రూ.30 వేల పరిహారం
నవతెలంగాణ - వేములవాడ
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. వేములవాడ స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ముద్రకోల చరణ్‌ను దోషిగా నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా సహా బాలికకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మైనర్‌తో పరిచయం పెంచుకున్న చరణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సదరు బాలిక తల్లి ఫిర్యాదుతో వేములవాడ పోలీసులు నిందితుని రిమాండ్ చేశారు. డీఎస్పీ నాగేంద్రచారి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సీ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వీరప్రసాద్, ఎస్ఐ శ్రవణ్ యాదవ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సీ, కోర్టు సిబ్బంది మహేందర్, నవీన్, వెన్నెల, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికను ఎస్పీ అభినందించారు.






కామెంట్లు (0)