Magazines

సీమ బొప్పనకు 
బెస్ట్ నేచర్ అడ్వైజర్ అవార్డు

22 నిమిషాల క్రితం

'Best Nature Advisor' Award for Seema Boppana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) నుంచి బెస్ట్ నేచర్ అడ్వైజర్ అవార్డును శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ బొప్పన అందుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని గోల్ఫ్ క్లబ్ లో అత్యంత వైభవంగా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్స్ లో నిర్వహిస్తున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా, విద్యార్థులలో పర్యావరణ, సామాజిక, ఆరోగ్య, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ హరితోదయ కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు.

ఈ కార్యక్రమానికి సీమ బొప్పన అందించిన నాయకత్వానికి, ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు.మిషన్ హరితోదయ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య స్కూల్స్ లో ఈ సంవత్సరం నిర్వహించారు. ఈ ప్రోగాంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, జంతువులు, పక్షులు ఆరోగ్యకరమైన, అనుకూలమైన వాతావరణంలో జీవించడానికి కూడా అవకాశం కలుగుతుందనే విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో అవగాహన కల్పించారు. సీమ బొప్పనకు అవార్డు లభించడం పట్ల శ్రీ చైతన్య స్కూల్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు, పరిపాలనా సిబ్బంది, ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్