Magazines

ద్విభాషా పాఠ్యపుస్తకాలు భేష్

14 నిమిషాల క్రితం

Bilingual textbooks are excellent.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రభుత్వానికి 
యునెస్కో ప్రశంస

యునెస్కో నివేదికను 
విడుదల చేసిన నికోలస్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం 8 భాషల్లో బోధనకు తోడ్పాటునందిస్తూ, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 274 ద్విభాషా పాఠ్యపుస్తకాలను రూపొందించడాన్ని యునెస్కో ప్రశంసించింది. డిజిటల్, గిరిజన భాషా వనరులపైన ఎస్ఈఆర్టీ రూపొందించిన 9 భాషల డిజిటల్ నిఘంటువు, టి-శాట్ దీక్షా వేదికలతో పాటు ఐఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ‘గిరిజన భాషా అనువాద వేదిక’ను కూడా ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. పిల్లలకు వారి మాతృభాష లేదా సుపరిచితమైన భాషలో విద్యాబోధన చేస్తే గ్రహణశక్తి, తరగతి గది భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతాయని యునెస్కో తన ‘భాషా మ్యాటర్స్: స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2025’ నివేదికలో స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఈ నివేదికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్, యునెస్కో జాతీయ కార్యక్రమ అధికారి డాక్టర్ హుమా మసూద్, ఐఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక మామిడి తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం - 2020కు అనుగుణంగా రూపొందించిన ఈ నివేదికలోని సిఫార్సులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు కావాలని నవీన్ నికోలస్ తెలిపారు.

కాగా లంబాడీ, గోండీ, కోలామీ భాషల్లో పఠన పుస్తకాలు రూపొందించిన ఉపాధ్యాయుడు తోడేలం శైలేష్ కృషిని నివేదిక అభినందించింది. వరంగల్ ఒక పాఠశాలలో గణిత బోధనలో ఆంగ్లంతో పాటు తెలుగును ఉపయోగించడం వల్ల విద్యార్థుల భాగస్వామ్యం 10 శాతం నుండి 70 శాతానికి పైగా పెరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. భాషా పరిజ్ఞానం,అనుభవాల ఆధారంగా విద్యను అందిస్తూ, క్రమంగా అదనపు భాషలను పరిచయం చేసినప్పుడు వారు మరింత సమర్థవంతంగా నేర్చుకుంటారని నివేదిక స్పష్టం చేసింది. ఒడిశా,తెలంగాణలోని గిరిజన,గ్రామీణ సందర్భాల నుండి వచ్చిన పరిశోధనా ఫలితాల ప్రకారం, పాఠశాలలు అభ్యాసకుల మాతృ భాషల్లో బోధన జరిగినప్పుడు, పఠన గ్రహణశక్తి, తరగతి గదిలో భాగస్వామ్యం, భావనాత్మక అవగాహన, జీవితకాల అభ్యాసానికి బలమైన పునాదులు వేసేందుకు మెరుగుపడుతుందని తెలిపింది. లంబాడీ, గోండీ, కోలామీ భాషలలో పఠన పుస్తకాలను అభివృద్ధి చేసిన ఉపాధ్యాయుడు తోడేలం శైలేష్ చేసిన కృషిని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్