Magazines

రేపు సీపీఎస్ ఉద్యోగుల 
‘సామూహిక సెలవు’ : టీఎస్ సీపీఎస్ఈయూ

1 గంట క్రితం

CPS employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలనే డిమాండ్ తో సీపీఎస్ ఉద్యోగులు నవంబర్ 17న ‘సామూహిక సెలవు’ పెట్టి నిరసన తెలుపనున్నట్టు టీఎస్ సీపీఎస్ఈయూ తెలిపింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యవర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించి మూడేండ్లైన సందర్భంగా ఈ నిరసన చేపడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే 1.50 లక్షల మందికి పైగా సెలవు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని పేర్కొంది. 11.5 శాతం కోతలు విధిస్తున్నా పెన్షన్ భద్రత, వైద్య భద్రతా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యానిఫెస్టో డే సందర్భంగా 2.15 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమ గర్జన వినిపిస్తారని హెచ్చరించింది. ఇది వరకే సీఎస్ సంజయ్ జాజుకు సామూహిక సెలవు ఉద్యమ తీర్మానాలను అందజేసినట్టు తెలిపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ కోరారు. సీపీఎస్ ఉద్యోగి వేతనంలో 10 శాతం పెన్షన్ కోసం, 1.5 శాతం ఈహెచ్ఎస్ కోసం కోత విధిస్తున్నా... ఆ ఉద్యోగులకు పెన్షన్, వైద్య భద్రత అందడం లేదని టీఎస్ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ తెలిపారు. ఆగస్టు 23 తర్వాత జేఏసీతో సీఎస్ జరిపిన చర్చల సందర్భంగా, 3 నెలల్లో అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని యూనియన్ కోరింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి మద్దు ప్రకటించాయని యూనియన్ వెల్లడించింది. అత్యవసర సేవల్లో ఉన్న 45 వేల మంది మినహా మిగిలిన 2.15 లక్షల మంది ఉద్యోగులు సామూహిక సెలవులో పాల్గొనాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

​

​

​

​

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్