Magazines

నకిలీ నోట్ల పేర మోసాలు.. నలుగురి అరెస్ట్

15 నిమిషాల క్రితం

Frauds involving counterfeit currency – four arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

99 కట్టల నోట్లు, 100 నకిలీ 
బంగారు నాణేలు స్వాధీనం : 
వివరాలు వెల్లడించిన
ఎస్పీ అఖిల్ మహాజన్

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్

​చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రిం చిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయి ఉన్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షలకు పైగా 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023 నవంబర్‌లో అత్రం పరశురామ్ పరిచయ మయ్యాడు. పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు ఇస్తే రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో రాములు 2023 నవంబర్ 10న ‌శ్యాంపూర్ గ్రామ శివారులో రూ.6.50 లక్షలు పరశురామ్‌‌కు ఇచ్చాడు. అనంతరం పూజలు చేసి డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఒక బ్యాగును అందించి పది రోజుల తర్వాత తెరవాలని సూచించాడు.

బ్యాగులో అసలు కరెన్సీకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. మళ్లీ బాధితుడిని నమ్మించి ఇంటి శుద్ధి పూజల పేరుతో పరశురామ్‌ మరో రూ.1.50 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీనిపై బాధితుడు రాములు నవంబర్ 22న ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు ర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితులైన అత్రం పరశు రామ్, మండలి బక్కన్న పూజలు, మంత్రతంత్రాల పేరుతో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసేవారు. వారికి సహకరిస్తున్న మరో నలుగురు నిందితులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర పేర్లతో ముద్రించిన నోట్లను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పైన, కింద అసలైన కరెన్సీ నోట్లు ఉంచి మధ్యలో చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను అమర్చి ప్రజలను అసలైన కరెన్సీగా నమ్మించి మోసం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన చీటి తరుణ్, ఇదే మండలం పొన్కల్ గ్రామానికి చెందన జమల్‌పూర్ సాయికృష్ణ అలియాస్ సాయి, జన్నారం గ్రామానికి చెందిన పేంద్రం సురేస్‌‌ను అరెస్టు చేశారు. వీరు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ ముఠాలో చేతి మోసపోయిన బాధితులు 40 మంది వరకు ఉండొచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితులు అత్రం పరశురామ్, మండలి బక్కన్న ఇప్పటికే ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో సోమవారం అరెస్టయ్యారు. రూ.500 ముఖ విలువతో ముద్రించిన 34 కట్టలు, రూ.100 ముఖ విలువతో ముద్రించిన 55 కట్టలు, రూ.2,000 ముఖ విలువతో ముద్రించిన 10 కట్టలు, మొత్తం 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల విలువ సుమారు రూ.40 లక్షలకు పైగా ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్