Magazines

నవతెలంగాణ రిపోర్టర్ జగన్ కుటుంబానికి ఆర్థిక చేయూత

21 నిమిషాల క్రితం

support for Jagan’s
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

బాధిత కుటుంబానికి 
రూ. లక్షా 12 వేల ఆర్థిక సాయం

అన్ని విధాలా అండగా ఉంటాం : టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు 

పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, న
వతెలంగాణ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్ రెడ్డి

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ జగన్ కుటుంబానికి టీడబ్ల్యూజేఎఫ్, నవతెలంగాణ అండగా నిలిచాయి. టీడబ్ల్యూజేఎఫ్, నవతెలంగాణ రంగారెడ్డి రీజియన్‌ ‌కలిపి బాధిత కుటుంబానికి రూ. లక్షా 12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేరిబాయ్ గణేష్, కార్యదర్శి మైల సైదులు, ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు చిలువేరు యాదగిరి, డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంతోపాటు నవతెలంగాణ రంగారెడ్డి రీజియన్‌ ‌కమిటీ మంగళవారం జగన్ కుటుం బాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య మాట్లాడారు. జగన్ కుటుంబం ఒంటరిది కాదని, జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం సంఘం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పేదరికంలో పుట్టి అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగన్‌.. జీవితంలో ముందుకు సాగారని గుర్తుచేశారు. విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల సమస్యలను పరిష్క రించేందుకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి జగన్ అని కొని యాడారు. జగన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. జగన్ కుటుంబానికి అందించిన రూ.1.12 లక్షల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి కొంతైనా ఊరటనిస్తుందని, భవిష్యత్‌లోనూ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నవతెలంగాణ సిబ్బంది ఆర్థిక సాయం

నవతెలంగాణ పత్రికలో మంచాల మండల రిపోర్టర్‌గా సుదీర్ఘకాలంగా పనిచేసి ఇటీవల అకాల మరణం చెందిన జగన్‌ ‌కుటుంబాన్ని నవతెలంగాణ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి డెస్క్ ఇన్‌‌చార్జి అజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా స్టాఫర్ మైల సైదులు, రిపోర్టర్స్.. జగన్ కుటుంబాన్నీ పరామర్శించారు. నవతెలంగాణ రంగారెడ్డి రీజియన్ రిపోర్టర్స్, సిబ్బంది జగన్ కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.46 వేల చెక్కును మేనేజర్ మహేందర్ రెడ్డి జగన్ భార్య లక్ష్మి, పిల్లలకు అందజేశారు. జగన్‌ ‌కుటుంబాన్ని భవిష్యత్‌‌లోనూ తోడ్పాటునందిస్తామని ఈ సందర్భంగా భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.సామెల్, మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగే రఘు, కార్యదర్శులు రాజశేఖర్, జగదీష్, నిరంజన్, సీనియర్ నాయకులు హాసిమ్, జిల్లా కమిటీ సభ్యులు పీ.వెంకటేష్, మణి, క్రాంతి, అంజి, సహాయ కార్యదర్శి ఎర్ర లింగం, ఉపాధ్యక్షులు కందుకూరి నగేష్, పి.శ్రీనివాస్, శివ, బాలరాజు, గిరికాంత్, శ్రీశైలం, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్