Magazines

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్రం

20 నిమిషాల క్రితం

corporates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

26న దేశవ్యాప్త రైతు నిరసనలు, 
 ఖమ్మంలో మోటార్ సైకిల్ ర్యాలీ :
సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల పిలుపు

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్న తరుణంలో, ధరలకు చట్టబద్ధత కల్పించాలని పోరాడుతున్న రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం దారుణమని సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ నాయకులు బొంతు రాంబాబు, దొండపాటి రమేష్, కొల్లేటి నాగేశ్వరరావు, ఎస్‌కే ఖాసిం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వాణిజ్య ఒప్పందాల వల్ల రైతులకు మరింత నష్టం వాటిల్లుతుందని, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే ఇటువంటి ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా దేశ రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఢిల్లీ రైతు ఉద్యమం ప్రారంభమైన నవంబర్ 26న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న రైతు ప్రదర్శనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో 26న పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మెరుగు సత్యనారాయణ, మలీదు నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్