Magazines

గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం

19 నిమిషాల క్రితం

Road accident on the greenfield highway
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

నవతెలంగాణ–వైరా

ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో కారులోని దంపతులు మృతిచెందగా, వారి కుమారునికి గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని దేవరపల్లి–ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వైరా ఎస్ఐ పిట్ల ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన దంపతులు కోట్ల కిషోర్ రెడ్డి (53), లావణ్య రెడ్డి (48), వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి (ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, గాంధీ మెడికల్ కాలేజీ) అందరూ కలిసి ఇన్నోవా కారు (టీఎస్‌ 01 కేడీ 2259)లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకుని సోమవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మంగళవారం ఉదయం 7.55 గంటలకు దేవరపల్లి–ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వైరా ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీ (కేఏ 56 ఏ 0906)ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషోర్ రెడ్డి, లావణ్య రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రణీత్ రెడ్డికి గాయాలయ్యాయి. ప్రణీత్ రెడ్డిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.​


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్