Magazines

కమ్యూనిస్టుల వల్లే ప్రతీ పల్లెకు కరెంటు, రోడ్డు

20 నిమిషాల క్రితం

It is because of the Communists that every village has electricity and roads.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

పిల్లల్ని చెడగొడుతున్న మార్కెట్‌ వ్యవస్థ ఏఐకేఎస్‌ అఖిల భారత మహాసభల కల్చరల్‌ ఫెస్ట్‌‌లో ప్రముఖ కవి, సాహిత్య విమర్శకుడు బెల్లి యాదయ్య

ప్రజల్ని చైతన్యపరిచే సినిమాలు రావాలి : సినీ దర్శకులు బాబ్జీ

పాలకులకు ఓట్లను దోచిపెట్టే సినిమాల్ని ఆదరించొద్దని విజ్ఞప్తి

నల్లగొండ నుంచి అచ్చిన ప్రశాంత్‌

తన ఊరికి కరెంటు సౌకర్యం రావడానికీ, బడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం రావడానికీ కమ్యూనిస్టులే కారణమని ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు బెల్లి యాదయ్య చెప్పారు. తన ప్రతి అడుగు బీద వర్గాల కోసమేనని చెప్పారు. ఏది సరిగాదో...ఏది తప్పో...ఏది చెడ్డదో...వాటినే మార్కెట్‌ ‌ప్రమోట్‌ ‌చేస్తున్నతీరును ఎండగట్టారు. నల్లగొండలో జరుగనున్నఅఖిల భారత కిసాన్‌ ‌సభ(ఏఐకేఎస్‌) 36‌వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలను సినీ దర్శకులు బాబ్జీ డప్పుకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ... పాఠశాలలు, కళాశాలల్లో 40 నిమిషాలు కూర్చొని క్లాసులు వినలేని పరిస్థితిని నేటి మార్కెట్‌ ‌వ్యవస్థ సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రజానాట్యమండలి కళాకారులే ఉపాధ్యాయులై తమ ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపర్చాలని కోరారు. బాబ్జీ మాట్లాడుతూ... ప్రజల ఓట్లను కొల్లగొట్టేలా కల్పిత కథలతో కొన్ని దృష్ట శక్తులు సినిమాలను తీయిస్తున్నాయని విమర్శించారు. అలాంటి ధోరణి పోయి ప్రజల్ని చైతన్యపరిచే సినిమాలు రావాలని ఆకాంక్షించారు. కుల, మత, మూఢనమ్మకాలను జాడ్యాలను ప్రజల్లోకి మరింత జొప్పించేలా...కల్పిత కథలతో ఓట్లను సంపాదించిపెట్టేలా...మనుషులను నిలువునా చీల్చేలా సినిమాలు రావడం దేశానికే ప్రమాదకారమని హెచ్చరించారు. పీఎన్‌ఎమ్‌ ‌సీనియర్‌ ‌కళాకారులు జగన్‌ ‌మాట్లాడుతూ..నల్లగొండ జిల్లాలో అక్షరాస్యతా ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తనలాంటి ఎంతోమంది కళాకారులు తయారుచేసిందీ, ఎంతోమంది గాయకులను తీర్చిదిద్దే అవకాశాన్ని తనకిచ్చిందీ పీఎన్‌ఎమ్‌‌నే అని గర్వంగా చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..మారుతున్న కాల పరిస్థితులకనుగుణంగా కళారూపాలు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రైతులు, ప్రజల కష్టాలకు కారణమవుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలి? ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాలా? ప్రజల్లోకి ఎలా పోవాలి? అనే దానిపై బలమైన ఉద్యమాలను తీసుకురావాలన్నారు. అందులో సాంస్కృతిక రంగం కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

పీఎన్‌ఎమ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కట్టనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ ఫెస్ట్‌‌లో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఫెస్ట్‌ ‌కన్వీనర్‌ ‌పాలడుగు నాగార్జున, పీఎన్‌ఎమ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌‌జే వినోద్‌, కోశాధికారి ఎ.గోవర్ధన్‌, పీఎన్‌ఎమ్‌ ‌రాష్ట్ర నాయకులు ఆనంద్‌, మారన్న, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమ్మరి శంకర్‌, నాంపల్లి చంద్రమౌళి, తదితరులు వేదికను పంచుకున్నారు.

కోలాటమేసిన రంగన్న..ఆకట్టుకున్న ఆటపాటలు

కల్చరల్‌ ‌ఫెస్ట్‌‌లో భాగంగా నార్కట్‌‌పల్లికి చెందిన మహిళలు కోలాట ప్రదర్శన చేస్తున్న సమయంలో పీఎన్‌ఎమ్‌ ‌సీనియర్‌ ‌కళాకారులు జగన్‌‌ తీసుకుని మరీ జూలకంటిరెడ్డి రంగారెడ్డి వేదికను ఎక్కారు. కోలాట బృందంతో కలిసి నాలుగైదు నిమిషాల పాటు వారు కోలాటమాడారు. సభికుల్ని చైతన్యపరిచారు. ఆగమోత్కురుకు చెందిన చెక్కభజన బృందం తన నృత్యాన్ని ప్రదర్శించింది. దేశంలో పాలకుల విధానాల వల్ల అన్నదాతల బతుకులు ఎలా ఛిద్రమవుతున్నాయనే విషయాన్ని పీఎన్‌ఎమ్‌ ‌కళాకారులు తమ ఆటపాటలద్వారా వివరించారు. తెలంగాణ గడ్డమీద జరిగిన వీరతెలంగాణ సాయుధ పోరాటాన్ని, అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ పాటలు పాడారు. జానపదకళాకారులు తమ ప్రదర్శనలిచ్చారు. సాయంత్రం ఆరున్నరకు ప్రారంభమైన కళారూపాల ప్రదర్శన రాత్రి పది గంటల తర్వాత కూడా కొనసాగింది. పీఎన్‌ఎమ్‌ ‌కళాకారుల పాటల్ని నల్లగొండ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్