Magazines

భారీగా ఐపీఎస్‌‌ల బదిలీలు

20 నిమిషాల క్రితం

IPS officers
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 3 నిమిషాల చదవడం

మహేష్ భగవత్ కు
నగర పోలీస్ కమిషనర్ పగ్గాలు

సౌమ్య మిశ్రా కు 
మహిళా భద్రత బాధ్యతలు

ఆర్టీసీ ఎమ్‌‌డీగా డాక్టర్‌ అనిల్‌ కుమార్‌

కొందరు సీనియర్లకూ స్థానచలనం

మొత్తం 21 మందికి ట్రాన్స్‌ఫర్‌లు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో కొందరు సీనియర్ ఐపీఎస్ లకు స్థానచలనం తో పాటు షాక్ లు ఇస్తూ బదిలీలు చేసింది. ముఖ్యంగా మహేష్ భగవత్ కు నగర పోలీస్ కమిషనర్ బాధ్యతలను అప్పగించి వీసీ సజ్జనార్ ను ఫైర్ సర్వీస్ ల విభాగానికి మార్చింది. జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ను రాష్ట్ర మహిళా భద్రత విభాగానికి బదిలీ చేసి జైళ్ల శాఖ పగ్గాలను స్వాతి లక్రా కు అప్పగించారు. అలాగే మరి కొందరు ఐపీఎస్ అధికారులకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనంగా మరి కొన్ని శాఖల ను అప్పగించారు. ఈ ఐపీఎస్ ల బదిలీల వెనుక డీజీపీ సీవీ ఆనంద్ చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణన లోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం జరిపిన ఐపీఎస్ అధికారుల బదిలీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి . ప్రస్తుతం తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ బృందాలు, భరోసా విభాగాల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. అదనంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆర్గనైజేషన్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లీగల్) బాధ్యతలు కూడా అప్పగించారు.

ప్రస్తుతం పోలీస్ ఆర్గనైజేషన్, హోమ్ గార్డ్స్, హెచ్ఎఫ్ఏసీ డీజీ, ఎస్పీఎఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న స్వాతి లక్రాను జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అలాగే హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న వీరిని మహేష్ మురళీధర్ భగవత్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసి నియమించారు. ప్రస్తుతం డీజీపీ సీఐడీ, మహిళా భద్రత విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న చారు సిన్హా అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా డీజీపీ, సీఐడీ బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. వి.సి. సజ్జనార్ ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా డీజీపీ ఎస్పీఎఫ్ బాధ్యతలు అప్పగించారు. వై. నాగి రెడ్డి నుసివిల్ సప్లైస్ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్‌గా నియమించారు. అదనంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారు. సంజయ్ కుమార్ జైన్ కు తెలంగాణ ట్రైనింగ్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించారు.

విక్రమ్ సింగ్ మాన్ ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్, తెలంగాణగా నియమించారు. అదనంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు అప్పగించారు. ఎం. స్టీఫెన్ రవీంద్ర ను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ మరియు రైల్ సేఫ్టీ బ్యూరో హైదరాబాద్ డైరెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అకున్ సబర్వాల్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియమించారు. అదనంగా పోలీస్ కోఆర్డినేషన్ మరియు టెక్నికల్ సర్వీసెస్ బాధ్యతలు కూడా అప్పగించారు. మల్టీ జోన్-I ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసి నియమించారు. ఈయన అవినాష్ మొహంతి స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న కార్తికేయ మల్టీ జోన్-I ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేసి నియమించారు. అదనంగా ఐసీసీసీ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా అప్పగించారు. కె. రమేష్ నాయుడు రైల్వేస్ మరియు రోడ్ సేఫ్టీ, తెలంగాణ, హైదరాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేసి నియమించారు. డి.జోయెల్ డేవిస్ ను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న వీరిని రోడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్, టీజీ - టీమార్స్ ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు.

అదనంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ అండ్ ట్రాఫిక్)గా ఉన్న జి. చందన దీప్తి జోన్-VI, జోగులాంబ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆర్. భాస్కరన్ కు హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌లోని డీఐజీ, సీఐ సెల్ బాధ్యతలతో పాటు డీఐజీ (ఇంటెలిజెన్స్) బాధ్యతలను అదనంగా అప్పగించారు. స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్‌లో పనిచేస్తున్న కె. నారాయణ నాయక్ కు బాసరా జోన్-II డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఎల్.ఎస్. చౌహాన్ ను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోఆర్డినేషన్‌గా నియమించారు. అదనంగా జోన్-VI, చార్మినార్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బాలా దేవిని తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ మరియు రైల్ సేఫ్టీ బ్యూరో హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వి. అరవింద బాబు హైదరాబాద్ సిటీ ఎస్ఎం అండ్ ఐటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్