Magazines

జూన్‌ 2 నాటికి టిమ్స్‌ పూర్తవ్వాల్సిందే

18 నిమిషాల క్రితం

TIMS
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

డిసెంబర్‌ నాటికి ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం జరగాలి : వైద్యారోగ్య సమీక్షలో సీఎం రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలనీ, డిసెంబర్‌ ‌నాటికి ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియ‌న్‌‌లో వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు. అందులో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ఎంపీ వేం నరేందర్ రెడ్డి,వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు, సీఎంవో కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి ఇలంబర్తి ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ. కర్ణన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్. వాణి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, సనత్‌నగర్ టిమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ నరేందర్, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ..మూడు టిమ్స్‌‌లకు ఒకే రిక్రూట్‌‌మెంట్‌ ఉండేలా చూడాలన్నారు. ఉద్యోగుల బదిలీలు మూడు టీమ్స్ మధ్య జరిగేలా ఉండాలని సూచించారు. హౌస్‌ కీపింగ్‌‌ను పూర్తి గా ఔట్‌‌సోర్సింగ్‌‌కు ఇవ్వాలన్నారు. నిమ్స్‌‌లో బెడ్లు ఖాళీగా లేకపోతే రోగులను సనత్ నగర్ టిమ్స్‌‌కు తరలించాలని సూచించారు. నిమ్స్‌, టిమ్స్‌ ‌మధ్య సమన్వయం ఉండాలన్నారు. సనత్ నగర్ టిమ్స్‌‌లో డాక్టర్ల నియామకం జరిగేవరకూ బయట నుంచి డాక్టర్లను నియమించుకోవాలని సూచించారు. టిమ్స్‌, ప్రభుత్వ వైద్య కళాశాలలకి అదనం గా కావాల్సిన నిధులని మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందని స్పష్టం చేశారు. వైద్యులు,సిబ్బంది హాజరు విషయంలో సాంకేతికతను వినియోగించాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్