Magazines

జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌తో ఎంపీ చామల భేటీ

23 నిమిషాల క్రితం

MP Chamala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధివారం హైదరాబాద్‌‌లో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంపై ఈ సందర్భంగా చర్చించారు. 2025 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి జపాన్‌ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన 86 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఎకో టౌన్‌షిప్ అభివృద్ధి, గ్రీన్ కొలాబరేషన్ ఒప్పందం పురోగతిని సమీక్షించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి జపాన్‌‌కు చెందిన వివిధ సంస్థల సాయంపై కుదిరిన ఒప్పందాలపై చర్చించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టాంకాం) ద్వారా తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలపై ఇద్దరు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్