Magazines

4,63,857 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు

23 నిమిషాల క్రితం

Aasara
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

19‌న లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా 4,63,857 ఆసరా పింఛన్‌ లబ్ధిదారుల‌ను ప్రభు త్వం ఎంపిక చేసింది. గత వారం రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు రాష్ర్ట వ్యా ప్తంగా లబ్ధిదారులకు పింఛన్ మంజూ రు పత్రాలను అందజేస్తున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న కొత్తగా మంజూరైన పింఛన్ సొమ్మును లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు సెర్ప్ ఏర్పాట్లు చేస్తోంది. నగదు బదిలీ ప్రక్రియకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. ఇందుకు అవసరమైన అదనపు బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన పింఛన్లలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది వికలాంగులు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు, 53,844 మంది ఒంటరి మహిళలు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్