వెంకటరమణ, అమర్‌కు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నివాళి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు వనం వెంకటరమణ, అమర్ మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) సంఘాలు నివాళులర్పిం చాయి. సోమవారం అంబర్ పేటలోని వెంకటరమణ నివాసంలో బౌతికదేహానికి సంఘాల నాయకులు పూలమాల వేసి అంజలి ఘటించారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘంతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు వెంకటరమణ, అమర్‌కు నివాళులర్పించారు. సీనియర్ రిపోర్టర్‌గా వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన వెంకట రమణ ఎప్పుడూ చిరునవ్వుతో సహచరులను, పరిచయస్తులను ఆప్యాయంగా పలకరిస్తుం డేవారని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం వరకూ అందరితో కలివిడిగా ఉన్న వెంకటరమణ.. ఆకస్మిక మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గతంలో ప్రజాశక్తి, నవతెలంగాణలో రిపోర్టర్ గా సబ్ ఎడిటర్ గా పనిచేశారు. V6 వెలుగు దినపత్రికతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ లో రిపోర్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు ప్రభ రిపోర్టర్ గా కొనసాగుతున్నారు. నివాళులర్పించిన వారిలో, ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి మాణిక్ ప్రభు, గుడిగ రఘు, బి రాజశేఖర్,హెచ్ యు జే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, సీనియర్ నాయకులు వంగాల రమేష్, యాదయ్య, ప్రశాంత్ తదితరులున్నారు. సోమవారం మధ్యాహ్నం అంబర్ పేట స్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.అలాగే అల్వాల్ చెందిన టీవీ9, ఎన్టీవీలో పనిచేస్తున్న అమర్ సైతం గుండెపోటుతో ఆదివారం మరణించడం విచారణ వ్యక్తం చేశారు. ఆయన కుటుంటానికి సానుభూతి తెలిపారు. ఇటీవల పనిఒత్తిడి, ఆర్థిక సమస్యలతో మూలంగా గుండెపోటుకు గురై జర్నలిస్టులు మృతి చెందుతున్నారనీ వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు.





కామెంట్‌లు (0)