బీజింగ్ : వచ్చే నెల 7-13 తేదీల మధ్య జుహైలో జరగబోయే 16వ ఎయిర్‌షో చైనాలో పాల్గొనే యుద్ధ విమానాలు, నౌకలు, ఇతర ఆయుధ వ్యవస్థల వివరాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీయల్‌ఏ) సోమవారం విడుదల చేసింది. పీయల్‌ఏ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం...ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానం జే-35, భారీ యుద్ధ విమానం జే-15టీ, గగనతల దాడులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసే కేజే-600 విమానం, ఆధునిక ట్రైనర్ జెట్ జేఎల్-15, బహుళ ప్రయోజక, రవాణా హెలికాప్టర్లు జడ్-20జే, జడ్-బీసీ, జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్ జడ్-20ఎఫ్, జలాంతర్గామి విధ్వంసక గస్తీ విమానం వై-9, మానవ రహిత హెలికాప్టర్ డ్రోన్ డబ్ల్యూజడ్-2 ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. టైప్ 075, టైప్ 055, టైప్ 054ఏ యుద్ధ నౌకల ప్రదర్శనలు కూడా ఉంటాయి. చైనా వైమానిక దళానికి చెందిన బాయి ఏరో బాయిక్ బృందంతో పాటు రష్యాకు చెందిన నైట్స్, యూఏఈకి చెందిన ఫుర్సాన్ అల్ ఎమరాత్ బృందాలు వైమానిక విన్యాసాలు చేస్తాయి. అంతరిక్ష విభాగంలో లాంగ్ మార్చ్-10బీ రాకెట్, సముద్ర ఆధారిత రికవరీ వ్యవస్థలు తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్నాయి.
డిసెంబర్ 7 నుంచి 16వ ఎయిర్‌షో చైనా
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)