రాజీనామా చేయాలంటూ సెనెట్ నేత షుమర్‌పై పెరుగుతున్న ఒత్తిడి
పోటీకి సిద్ధమైన క్రిస్ వాలెన్ హోలెన్
వాషింగ్టన్ : ఇటీవల అమెరికా సెనెట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో చక్ షుమర్ నేతృత్వంలో డెమొక్రాట్లు స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన నాయకత్వంపై పార్టీలోని ప్రగతిశీల శక్తులు, సెనెట్ సభ్యులు, కొన్ని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో జనవరిలో ప్రారంభమయ్యే కొత్త సెనెట్‌లో 'మెజారిటీ నేత' పదవి కోసం షుమర్‌కు పార్టీలో గట్టి పోటీ ఎదరవుతోంది. పార్టీలో మరింత పారదర్శకత, నూతన సభ్యులకు ప్రాధాన్యత ఉండాలని కోరుతూ మేరీల్యాండ్ సెనెటర్ క్రిస్ వాన్ హోలెన్ ఆయనపై పోటీకి దిగారు. మరోవైపు షుమర్ తిరిగి ఎన్నిక కావడానికి మద్దతు ఇవ్వబోమని సెనెటర్ బెర్నీ సాండర్స్ వంటి వారు ఇప్పటికే ప్రకటించారు. 1994 తర్వాత సెనెట్ డెమొక్రటిక్ నాయకత్వ పదవికి పోటీ జరగడం ఇదే మొదటిసారి. తనపై వచ్చిన విమర్శలు, రాజీనామా డిమాండ్లను షుమర్ తోసిపుచ్చారు.
తనకు ఇప్పటికే పదిహేను మంది సెనెటర్ల మద్దతు ఉన్నదని వాన్ హోలెన్ తెలిపారు. బెర్నీ సాండర్స్, జెఫ్ మెర్క్‌లీ, ఎలిస్సా స్లాట్‌కిన్‌తో పాటు కొత్తగా ఎన్నికైన అబ్దుల్ ఎల్-సయీద్, పెగ్గీ ప్లానాగన్ సహా ఐదుగురు ఆయనకు బహిరంగంగా మద్దతు తెలిపారు. మెజారిటీ లీడర్‌గా కొనసాగడానికి అవసరమైన ఓట్లు తన వద్ద ఉన్నాయని హోలెన్ ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ విషయంలో షుమర్, హోలెన్ మధ్య భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌కు అత్యధిక భద్రతా సాయం అందిం చడంలో తాను కీలక పాత్ర పోషిం చానని, ఆ మద్దతును కొనసాగిస్తానని షుమర్ తెలిపారు. హోలెన్ మాత్రం పాలస్తీనా హక్కుల పక్షాల నిలిచారు. ఇజ్రాయిల్ విషయంలో షుమర్ విధానాలను, ఇజ్రాయిల్ అనుకూల లాబీయింగ్ గ్రూపులతో ఆయనకు ఉన్న సంబం ధాలను హోలెన్ విమర్శించారు. అమెరికా ప్రజలు మార్పు కోసం ఓటేశారని, కాబట్టి ఇంకా పాత పద్ధతులనే కొనసాగించ లేమని ఆయన వ్యాఖ్యానించారు. తనకు మద్దతు ఇస్తున్న సెనెటర్లను భయపెట్టేందుకు షుమర్ బృందం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
ప్రతినిధిసభలో డెమొక్రాట్లకు రికార్డు మెజారిటీ
ఇటీవల ప్రతినిధిసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు 258 స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించారు. 1992 తర్వాత దిగువ సభలో డెమొ క్రాట్లకు ఈ స్థాయిలో మెజారిటీ లభించడం ఇదే మొదటి సారి. తాజాగా నార్త్ కరోలి నాలోని ఐదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ స్థానంలో ఆదివారం రీకౌంటింగ్ జరగ్గా డెమొ క్రటిక్ అభ్యర్థి చక్ హబ్బర్డ్ విజయం సాధిం చారు. కాంగ్రెస్‌కు 11 పర్యా యాలు ప్రాతి నిధ్యం వహించిన సిట్టింగ్ సభ్యుడు, రిపబ్లికన్ అభ్యర్థి వర్జీనియా ఫాక్స్‌ను ఆయన ఓడించారు. ఈ ఎన్నికల్లో నార్త్ కరోలినా సహా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న అనేక ప్రాంతాల్లో డెమొక్రాట్లు ఘన విజయాలు సాధించడం విశేషం.






కామెంట్‌లు (0)