Magazines

ఎస్వీకే గచ్చిబౌలి అడ్మిన్‌ విజయ్‌‌కుమార్‌ కన్నుమూత

20 నిమిషాల క్రితం

Vijay Kumar
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎస్వీకే గచ్చిబౌలి కార్యదర్శి పి ప్రభాకర్, బాగ్‌ లింగంపల్లి ‌మేనేజింగ్‌ ‌కమిటీ కార్యదర్శి ఎస్‌ విన‌య కుమార్ సహా పలువురి నివాళి

ముగిసిన అంత్యక్రియలు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) గచ్చిబౌలి అడ్మిన్ సి విజయ్ కుమార్ (46) కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మాధవి, కుమార్తె భవ్య, కుమారుడు తేజు ఉన్నారు. కుమార్తె ఇంటర్‌, కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. ఆయన మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎస్వీకే గచ్చిబౌలి కార్యదర్శి పి ప్రభాకర్, ఎస్వీకే బాగ్‌ లింగంపల్లి ‌మేనేజింగ్‌ ‌కమిటీ కార్యదర్శి ఎస్‌ విన‌య కుమార్, ట్రస్టు సభ్యులు ఆర్ సాంబశివరావు, అడ్మిన్ రమణరావు, బుచ్చిరెడ్డి, సోమన్న భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాఘవులు, ప్రభాకర్‌ ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. విజయ్‌‌ కుమార్‌ అకాల మరణం పట్ల సంతాపం తెలిపారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మనో ధైర్యాన్ని కోల్పోవద్దని పిల్లలకు ధైర్యం చెప్పారు. చదువులు కొనసాగించాలనీ, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీపీఐ(ఎం) నాయకులు శోభన్‌, కృష్ణ, జేవీవీ నాయకులు ప్రొఫె సర్‌ ఏ రామచంద్రయ్య, శ్రీనివాస్‌, టీఎస్‌‌యూటీఎఫ్‌ ‌‌రంగారెడ్డి నాయ కులు భగవంత్‌‌రాజు, జగన్‌, సాఫ్ట్‌‌వేర్‌ ‌ప్రతి నిధులు రామయ్య, రంగారావు, రాణి, చైతన్య, ఎస్వీకే గచ్చిబౌలి బాధ్యులు రవీందర్, అనిల్, సిబ్బంది తదితరులు పాల్గొని నివాళుల ర్పించారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలి పీజేఆర్‌ ‌నగర్‌ ‌శ్మశానవాటికలో ఆయన అంత్య క్రియలు ముగిశాయి. ఆయనకు సీపీఐ(ఎం) నాయకులు, ఎస్వీకే గచ్చిబౌలి ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ‘జోహార్‌ విజయ్‌‌కుమార్‌’, ‘అమర్‌ ‌రహే విజయ్‌‌కుమార్‌’ అంటూ నినాదాలు చేశారు. కడసారి చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్