Magazines

ఓటేసిన జిన్‌పింగ్‌

13 నిమిషాల క్రితం

vote
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌: చైనా అధినేత షి జిన్‌పింగ్‌ బీజింగ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగిం చుకున్న అరుదైన దృశ్యం శుక్రవారం ఆవిష్కృత మైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సైనిక కమిషన్‌ చైర్మెన్‌ అయిన జిన్‌పింగ్‌ జోంగ్‌ నాన్‌హై నియోజక వర్గంలోని హువాయి రెంటాంగ్‌ పోలింగ్‌ కేంద్రంలో బ్యాలట్‌ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. జోంగ్‌నాన్‌హై చైనా కమ్యూనిస్టు పార్టీకి కేంద్ర స్థానం. చైనాలో మూడంచెల వ్యవస్థ పనిచేస్తోంది. అట్టడుగున స్థానిక సంస్థలు, వాటిపైన రాష్ట్ర చట్ట సభలు, అన్నిటికంటే అగ్రభాగంలో జాతీయ పార్లమెంటు ఉన్నాయి. వీటన్నిటికీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన, లేదా అది సూచించిన అభ్యర్థులే ఎన్నిక అవుతూ ఉంటారు. చైనాలో ఏకపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని ఇతర పార్టీలు ఉన్నా అవి చైనా కమ్యూనిస్టు పార్టీ సమ్మతితోనే కార్యకలాపాలు నిర్వరిస్తుంటాయి.

ఈ నెల్లో జిన్‌‌పింగ్‌, ట్రంప్‌, పుతిన్‌ సమావేశం ?

చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌మధ్య చారిత్రక సమావేశం నిర్వహించే విషయమై చర్చిస్తున్నట్లు తొలిసారిగా చైనా ధృవీకరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ ఈ వారంలో బీజింగ్‌‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు. మూదు దేశాల అధినేతల మధ్య సమావేశం విషయమై సంబంధిత పక్షాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. షెన్‌‌జెన్‌‌లో జరిగే ప్రాంతీయ సమావేశం నేపథ్యంలో ఈ నెల్లో ఈ సమావేశం జరిగే అవకాశం వుందన్నారు. అయితే ఇంకా ఏదీ నిర్ణయం కాలేదన్నారు. ఒకవేళ అదేగనుక జరిగితే అదొక చారిత్రక సమావేశమే కాగలదని వ్యాఖ్యానించారు. ముగ్గురు నేతల ప్రయోజనాలు భిన్నమైనవి అయినందున దేనిపైనా వారు గణనీయంగా చర్చించే అవకాశం లేదన్నారు. ఫోటో కోసం వారు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని చైనా చాలా జాగ్రత్తగా రూపొందిస్తుందన్నారు. ఏ తరహాలో వుండాలి, ఎలాంటి సమాచారం వుండాలనేది పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్