అమెరికాలో ఏరులై పారిన సొమ్ము
పోటాపోటీగా డబ్బు వెదజల్లిన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు
రూ.1190 కోట్ల ఖర్చు : ‘ఓపెన్ సీక్రెట్స్’ అంచనా
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు ఆ దేశ చరిత్రలోనే చాలా ఖరీదైనవని రాజకీయ నిధుల సమీకరణను పర్యవేక్షించే ఓపెన్ సీక్రెట్స్ అనే నిస్పాక్షిక సంస్థ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం వ్యయం అనూహ్యంగా రూ.1190 కోట్లకు చేరిందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో కేవలం బయటి గ్రూపుల వ్యయమే 3.9 బిలియన్ డాలర్లు కాగా మూలాలు తెలియని నిధులు (డార్క్ మనీ) ఒకటిన్నర బిలియన్ డాలర్ల వరకూ ఉన్నాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం యూఎస్ సెనెట్ పోరులో బయటి గ్రూపులు, స్వతంత్ర కమిటీలు కనీసం రెండు బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అభ్యర్థుల ఖర్చులకు ఇది అదనం. డెమొక్రాట్లకు సంబంధించిన గ్రూపులతో పోలిస్తే రిపబ్లికన్ అనుబంధ బృందాలు తక్కువే ఖర్చుచేశాయి. మొత్తంగా చూస్తే సెనెట్ రేసులో డెమొక్రాట్లు సుమారు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా రిపబ్లికన్ అభ్యర్థుల వ్యయం ఐదు వందల మిలియన్ డాలర్ల కంటే తక్కువగానే ఉంది.
ఈ నిధుల ప్రాబల్యంతోనే సెనెట్, ప్రతినిధిసభలో డెమొక్రాట్లు కీలక విజయాలు సాధించారు.
టెక్సాస్ రాష్ట్రంలో రిపబ్లికన్ అభ్యర్థి, రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్‌ను గెలిపించడం కోసం మస్క్, రిపబ్లికన్లు ఏకంగా 316 మిలియన్ డాలర్లు వెచ్చించారు. డెమొక్రాట్ అభ్యర్థి సొంతగా 146 మిలియన్ డాలర్లు, ఆ పార్టీ గ్రూపులు 109 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఓహియో, మిచిగాన్‌లో కూడా ప్రచార వ్యయం భారీగానే జరిగింది. జార్జియా, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ల విజయావకాశాలు సన్నగిల్లడంతో అక్కడ పెద్దగా ఖర్చు చేయలేదు. అదే సమయంలో సౌత్ కరోలినా, మిసిసిపీ, కన్సాస్‌లో పోటీ తీవ్రంగా ఉండడంతో అక్కడ నిధులు ఏరులై పారాయి.
టెహ్రాన్‌లో స్టీవ్ విట్కాఫ్, ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు , జేడీ వాన్స్‌ల చిత్రాలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాజయాన్ని అందించిన కొన్ని గంటలకే, ప్రభుత్వ ఇరాన్ అనుకూల వ్యక్తులు ఆనందోత్సవాలు నిర్వహించారు. అనంతరం టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో గుమిగూడి ఆ భారీ బ్యానర్‌కు నిప్పుపెట్టారు.
రిపబ్లికన్లకు వెన్నుదన్నుగా మస్క్
టెక్సాస్‌లో అత్యధికంగా 488 మిలియన్ డాలర్లకు పైగా సొమ్మును బయటి గ్రూపులు ఖర్చు చేశాయి. ఇక్కడ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారీగా సొమ్మును వెదజల్లారు. ఓహియోలో 424 మిలియన్ డాలర్లు, మిచిగాన్‌లో సుమారు 342 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. బిలయనీర్లు, డోనర్లు భారీగా నిధులు కుమ్మరించినప్పటికీ ఫలితాలు భిన్నంగా రావడం గమనార్హం. ఓపెన్ సీక్రెట్, ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ తాజా డేటా ప్రకారం రిపబ్లికన్ల గెలుపు కోసం మస్క్ ఏకంగా 445 మిలియన్ డాలర్లు (రూ.3,700 కోట్లు) కుమ్మరించారు. ఇందులో ఎక్కువ భాగం నిధులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఖర్చయ్యాయి. మస్క్ స్థాపించిన ‘అమెరికా పీఏసీ’ ఈ ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసింది. మస్క్ ఈ గ్రూపు ద్వారా జూలై నుంచి సుమారు 276 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇందులో 158 మిలియన్ డాలర్లను కేవలం సెనెట్ అభ్యర్థుల ప్రచారం కోసమే కేటాయించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో రెండు నిధులకు కూడా మస్క్ విరాళాలు అందజేశారు.





కామెంట్‌లు (0)