జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజిని
నవతెలంగాణ – ఆత్మకూరు
శనివారం వనపర్తి జిల్లా లోని అమరచింత మండల బాలుర ఉన్నత పాఠశాల లో చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ముఖ్యఅతిథిగా వి.రజని హాజరయ్యి మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తు వంటి పదార్థాల కు దూరంగా ఉండాలని డ్రగ్స్ నిరోధక చట్టం పై అవగాహన కల్పించారు. మైనర్ లు లైసెన్స్ లేనిదే వాహనాల ను నడపరాదని మోటార్ వెహికల్ చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
లైంగిక వేధింపులకు గాను పోక్సో చట్టం గురించి వివరించారు. కార్యక్రమం లో భాగంగా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున న్యాయ సలహాల ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవలసినది గా కోరారు.కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీదేవి, పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణమ్మ,మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES